తెలుగులో స్టార్ క్రేజ్ ఎలా ఉన్నా మలయాళంలో మాత్రం ముదిరిందని చెప్పాలి. ముఖ్యంగా మన హీరో కోసం అక్కడ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఓ రివ్యూయర్ ను బెదిరించిన కేసులో ప్రస్తుతం కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా నా పేరు సూర్య.
ఈ సినిమా మలయాళంలో కూడా రిలీజ్ అయ్యింది. అక్కడ అపర్ణ ప్రశాంతి అనే రివ్యూయర్ ఆ సినిమాపై నెగటివ్ రివ్యూ వచ్చింది. సినిమా మొదలైంది తలనొప్పి మొదలైంది.. బయటకెళ్దామంటే వర్షం వస్తుంది ఏం చేయను అంటూ రివ్యూ ఇచ్చింది. దానిపై అక్కడ బన్ని ఫ్యాన్స్ చాలా సీరియస్ అయ్యారు.
ఆమె ను చంపేస్తామని.. రేప్ చేస్తామని బెదిరించారు. ముందు వాటిని లైట్ తీసుకున్న అపర్ణ.. ఫ్యాన్స్ తాకిడి ఎక్కువవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందట. దాదాపు 18 మంది ఫ్యాన్స్ ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. వారి మీద మహిళా బెదిరింపు కేసు.. ఐపిసి 364, 354, 294, 506 సహా ఐటీ యాక్ట్ లోనూ కొన్ని సెక్షన్స్ పెట్టారట. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫేక్ ఎకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఈ కామెంట్స్ పెట్టడం జరిగిందట. ఇక వీరిలో నియాసుద్ధిన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మిగతా వారి కోసం సెర్చ్ చేస్తున్నారట.