జూన్ 14.. ఒక్కరోజు ముగ్గురు హీరోల ఫ్యూచర్ ను మార్చేసింది. కొందరికి సంతోషాలను ఇచ్చిన ఈరోజు కొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే జూన్ 14 ఈరోజు చాలా స్పెషల్ డే.. మెగా, నందమూరి ఫ్యాన్స్ అందరికి ఇది ప్రత్యేకమైన రోజు. 2012లో ఈరోజే ఉపాసనను పెళ్లాడాడు రాం చరణ్. ప్రేమించుకుని పెళ్లిచేసుకున్న ఈ ఇద్దరు వారి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ ఇయర్ ఇదే రోజు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు స్పెషల్ గా మారింది. తన కుటుంబంలో మరో సభ్యుడిని ఆహ్వానించాడు తారక్. తన రెండో వారసుడు ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇది తప్పకుండా ఎన్.టి.ఆర్ కు మాత్రమే కాదు నందమూరి ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన వార్త అని చెప్పొచ్చు.
చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఈరోజు ఆనందంగా ఉంటే కళ్యాణ్ రాం మాత్రం చింతిస్తూ ఉన్నాడు. కెరియర్ లో ప్రయోగాలు చేయాలనుకున్న ఈ నందమూరి హీరో జయేంద్ర డైరక్షన్ లో నా నువ్వే సినిమా చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న కళ్యాణ్ రామ్ ఈ పాత్రలో మెప్పించలేకపోయాడు. తనవరకు బాగానే ఉన్నా సినిమాకు అది హెల్ప్ అవలేదు. మొత్తానికి ఈ జూన్ 14 ఎన్.టి.ఆర్, చరణ్ లకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా కళ్యాణ్ రామ్ కు మాత్రం చేదు జ్ఞాపకమని చెప్పొచ్చు.