Gossipsబాలయ్య అడిగితే `నో` చెప్పిన నాగ్‌..!

బాలయ్య అడిగితే `నో` చెప్పిన నాగ్‌..!

నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునల మధ్య మాటల్లేవు అన్నది అందరికి తెలిసిందే. మీడియా ముందు మా మధ్య ఎలాంటి గొడవలు లేవని పైకి చెబుతున్నా సరే బాలయ్య, నాగార్జునల మధ్య డిస్టెన్స్ అలానే ఉందని అంటున్నారు. ఈమధ్య నాగార్జునని ఈ విషయంపై అడిగితే అలాంటిదేమి లేదని అన్నాడు.

కాని బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రకి నాగార్జునని అడిగాడట బాలకృష్ణ. కాని ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట నాగార్జున. నాగార్జున మాత్రమే కాదు నాగ చైతన్య కూడా ఏయన్నార్ పాత్రకి నో చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ బాలకృష్ణతో గొడవలు ఏమి లేవు అనుకుంటే ఏయన్నార్ గా నాగార్జున చేసి ఉండేవాడని అంటున్నారు.

సీనియర్ స్టార్స్ మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. ఓ పక్క బాలకృష్ణ జూనియర్ ఎన్.టి.ఆర్ ను దూరం పెట్టాడు. కళ్యాణ్ రాం మాత్రం బాబాయ్ తో ఎప్పటిలానే మంచి రిలేషన్ తో ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news