మహానటి సినిమాలో ఏయన్నార్ గా నాగ చైతన్య నటించి మెప్పించారు. ఎన్.టి.ఆర్ ను మాటకు ప్రస్థావించారే తప్ప సినిమాలో అంత ప్రాధ్యాన్యత ఇవ్వలేదు. నిజానికి జూనియర్ తాత పాత్రలో నటించడానికి ఒప్పుకుని ఉంటే బాగుండేదని అన్నారు. అశ్వనిదత్ ఎంత ప్రయత్నించినా తాత రోల్ లో ఎన్.టి.ఆర్ నటించేందుకు ససేమీరా ఒప్పుకోలేదు.
మహానటి ఆడియోలో తాత పాత్రలో నటించే అర్హత ఆ స్థాయి తనకు లేదని చెప్పాడు కాని ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్.టి.ఆర్ తన కెరియర్ మొదలు పెట్టిననాటి నుండి తాత పేరుని వాడేస్తూ ఉన్నాడు. ఇలా చేయడం బాలకృష్ణకు నచ్చలేదట. ఇక ఏకంగా తన తండ్రి రోల్ లో జూనియర్ నటించడానికి వీలు లేదని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడట.
అందుకే బాబాయ్ తో వైరం పెంచుకునే ఉద్దేశం లేకనే తారక్ అన్నగారిగా నటించనని చెప్పాడు. ఇక మరోపక్క బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ప్రయోగం చేస్తున్నాడు. మహానటికి ధీటుగా ఆ మహానటుడి జీవిత చరిత్రను తెర మీద ఆవిష్కరించాలని చూస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.