బాహుబలి చిత్రం తో ఇంటెర్నేషన్ లెవెల్ లో తన ఇమేజ్ ని పెంచుకున్న ప్రభాస్ కి ఇంకా పెళ్లి కాలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా వరకు 4 సంవత్సరాలు అంకితభావం తో పనిచేయటానికి పెళ్లి ని కూడా వాయిదా వేసుకున్నాడు. అటువంటిది బాహుబలి 2 విడుదలయి కూడా ఇప్పటికి ఒక సంవత్సరం దాటింది. అయినప్పటికీ ఇంకా ప్రభాస్ పెళ్లి ఊసు మాత్రం ఒక అడుగు కూడా జరిగినట్టు లేదు. అనుష్క తో ప్రేమ అంటూ పెళ్లి అంటూ ఒక పక్క నేషనల్ మీడియాలో కూడా రూమర్లు వస్తున్నాయి. మరోపక్క కొణిదెల వారింటి పిల్ల నిహారిక తో కూడా లింకులు పెట్టారు మీడియా వాళ్ళు. కానీ అసలు విషయం మాత్రం ముందుకు జరగటం లేదు. అయితే అసలు ప్రభాస్ పెళ్లి ఇప్పటివరకు కుదరకపోవటానికి కారణం ఇదంటూ ఒక కారణం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ మేటర్ ఏంటో తెలిస్తే నిజంగానే అవాక్కవుతారు.
చాలా మంది ప్రేమికులు విడిపోవడానికి , కొన్ని హత్యలకు మరి కొన్ని ఆత్మ హత్యలకు కారణమయ్యే కులమే ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ విలన్ గా మారిందట. ప్రభాస్ క్షత్రియ కులానికి చెందినవాడవటం , వారి కులపెద్దలు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు గారిపై వేరే కులపు అమ్మాయితో పెళ్లి జరపరాదంటూ వత్తిడి తెస్తుండటంతో పాపం ప్రభాస్ ఇంకా బ్రహ్మచారి గానే కాలం వెళ్లదీస్తున్నాడు.ఈ విషయం కారణం గానే తను ఎంతగానో ప్రేమించే ఒక హీరోయిన్ కి దూరంగా ఉండాల్సి వస్తుందని గుసగుసలు. ఇక వారి కులపు అమ్మాయిల సంబంధాలు ఇంతవరకు ప్రభాస్ కి నచ్చకపోవడం తో పెళ్లి ముచ్చట ఇంకా సాగుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికి ప్రభాస్ పెళ్లి చేసుకొని త్వరగా ఒక ఇంటి వాడవ్వాలని కోరుకోవటం మినహా మనం చేయగలిగింది ఏమి లేదు. అన్నట్లు మీకు తెలిసిన అమ్మాయెవరైనా ఉంటే చెబుదురు..