మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ లలో డ్యాన్సింగ్ స్టార్ అని అందరికి తెలిసిందే. టాలీవుడ్ డ్యాన్సింగ్ హీరోస్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ లతో పోటీపడి మరి డ్యాన్స్ వేసే భామలలో తమన్నా ఒకరు. ప్రస్తుతం కెరియర్ పరంగా కాస్త వెనుకపడి ఉన్న తమన్నా ఆడియెన్స్ అటెన్షన్ పొందేందుకు హాట్ స్నేక్ డ్యాన్స్ తో అల్లాడించేసింది.
పారిస్ డిజే స్నేక్ చేసిన ఛాలెంజ్ కు బదులుగా అమ్మడు మెజెంటా రిడిం పాటకు డ్యాన్స్ చేసి తమన్నా దుమ్ముదులిపింది. డిజే స్నేక్ ఛీలెంజ్ ఒప్పుకోవడమే కాదు ఆ ఛాలెంజ్ లో నెగ్గి సత్తా చాటింది మిల్కీ బ్యూటీ. డిజే స్నేక్ కోసం ఛాలెంజ్ ఒప్పుకున్న తమన్నాకు జూయీ వైద్య డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ప్రస్తుతం తమన్నా డ్యాన్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తుందు.
పారిస్ డిజే స్నేక్ తమన్నాకు మంచి స్నేహితుడు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన స్నేక్ కు బాహుబలి దగ్గర ఉండి మరి చూపించింది తమన్నా. మొత్తానికి తన షేకింగ్ డ్యాన్స్ తో తమ్మూ మరోసారి వార్తల్లో నిలిచిందన్నమాట. మరి ఈ డ్యాన్స్ ఆమె కెరియర్ కు ఏదైనా అవకాశాలను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం కళ్యాణ్ రాం తో నా నువ్వే సినిమాలో నటించిన తమన్నా ఆ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకుంది.
https://youtu.be/mtNrrSg_5pM