Gossipsఅఖిల్ కి షాక్ ఇచ్చిన శ్రీయ.. ఆనందంతో చరణ్ సందడి..

అఖిల్ కి షాక్ ఇచ్చిన శ్రీయ.. ఆనందంతో చరణ్ సందడి..

అక్కినేని అఖిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్ధం దాకా వెళ్లిన శ్రీయా భూపాల్ ఏం జరిగిందో ఏమో కాని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత అఖిల్ తన ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టాడు. ఇదిలా ఉంటే శ్రీయా భూపాల్ మరొకరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. జివికె మనవరాలు అయిన శ్రీయా భూపాల్ అపోలో అధినేత ప్రతాపరెడ్డి మనవడు అనిందిత్ రెడ్డితో వివాహం జరిగింది.

పారిస్ లో కేవలం జివికే, అపోలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే ఈ పెళ్లి జరిగిందని తెలుస్తుంది. అపోలో అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన ద్వారా ఈ పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఉపాసనతో పాటుగా రాం చరణ్ ఈ పెళ్లికి అటెండ్ అవడంతో అక్కడ హంగామా మొదలైంది. అఖిల్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న శ్రీయా భూపాల్ ఫైనల్ గా అపోలో అధినేత ప్రతాపరెడ్డి ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుందన్నమాట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news