గత 6, 7 ఏళ్లుగా శాంసంగ్, యాపిల్ ఫోన్ల మధ్య నలుగుతూ వస్తున్న పేటెంట్ రైట్స్ వివాదంపై తాజాగా తీర్పు వచ్చింది. 2011-12 సంవత్సరాల్లో శాంసంగ్ పై యాపిల్ పేటెంట్ల వాడకంపై కోర్టులో కేసు వేసింది. తాము తయారు చేసిన పేటెంట్లను శాంసంగ్ కాపీ చేసి వాడుతున్నారని పేర్కొంది.
కొన్నాళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసుపై తుది తీర్పు లభించింది. పేటెంట్ల కాపీ జరిగిందని ప్రూవ్ అయ్యింది. అందుకుగాను శాంసంగ్ కు 3600 కోట్ల జరిమానాగా యాపిల్ కు చెల్లించాలని కోర్టు తీపు ఇచ్చింది. కాలిఫోర్నియా సెయింట్ జోస్ లోని ఫెడరల్ కోర్ట్ యాపిల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
యాపిల్ నుండి రెండు యుటిలిటీ పేటెంట్లు, 3 డిజైన్ పేటెంట్లు శాంసంగ్ కాపీ చేసినట్టు నిర్ధారితమైంది. ప్రస్తుతం మార్కెట్ లో కొత్త మొబైల్స్ హవా నడుస్తుంది. అసలే సేల్స్ తక్కువయ్యాయని చెబుతున్న శాంసంగ్ కు ఇది అదనపు భారమని చెప్పొచ్చు. మరి ఈ తీర్పు గురించి శాంసంగ్ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.