సంచలనం ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆయన టాలెంటే ఆయన ఆయుధం అలాంటి వర్మ తనలాంటి సెల్యులాయిడ్ టెర్రరిస్టులను తయారు చేయాలని భావించాడు. సినిమాల మీద ఆసక్తితో ఈ రంగంలో అభివృద్ధి చెందాలని కలలు కనే వారు ఎక్కడెక్కడో సినిమా టెక్నాలజీ కోర్సులు చేస్తుంటారు.
అలాంటివారికి ఆర్జివి అన్ స్కూల్ అంటూ ఓ ఫిల్మ్ ఇనిసిస్టూట్ పెట్టారు. న్యూయార్క్ కు చెందిన రాం స్వరూప్, శ్వేతారెడ్డి సపోర్ట్ తో ఈ ఇనిసిస్టూట్ పెట్టానని అన్నారు ఆర్జివి. ఇక తనని అందరు సెల్యులాయిడ్ టెర్రరిస్ట్ అంటారని తన దగ్గరకు వచ్చే వారిని అలానే మార్చుతానని అంటున్నారు వర్మ. చెప్పడమని కాదు కాని ఇప్పుడున్న దర్శకుల్లో సగానికి పైగా వర్మను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఫాలో అయినా వారే.
మరి ఈసారి వర్మనే తన ఇనిసిస్టూట్ లో పాఠాలు చెబితే ఇంకెలా ఉంటుంది. అయితే అందరిలా తన టీచింగ్ ఉండదని.. వేరే ఇనిసిస్టూట్ లో ఇంకా ఓల్డ్ ఎక్విప్మెంట్ వాడుతున్నారని తమ ఇనిసిస్టూట్ లో అది ఉండదని చెప్పాడు వర్మ. ఇక కాలేజిలో రెండు రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన తాను ఇలా టీచింగ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు ఆర్జివి. హైదరాబాద్, ముంబై, న్యూయార్క్ లలో ఈ ఇనిసిస్టూట్ ప్రారంభించనున్నారు.