సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ పై ఎవరైన కేసు పెట్టడం గురించి ఇన్నాళ్లు విన్నాం కాని ఈసారి మాత్రం రివర్స్ లో ఆర్జివినే కేసు పెట్టేందుకు పోలీస్టేషన్ మెట్లెక్కడం జరిగింది. తన దగ్గర పనిచేసిన జయకుమార్ అనే వ్యక్తి మీద మార్ఫింగ్ కేసు పెట్టారు ఆర్జివి. ఇదవరకు ఆఫీసర్ కథ నాదే అంటూ ఆర్జివి మీద జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు మియా మాల్కోవాతో తీసిన జిఎస్టి కాన్సెప్ట్ కూడా తనదే అని ప్రకటించాడు జయకుమార్. తన ఆరోపణలన్ని నిరాదారం కావడంతో తన ఫోటోని ఓ న్యూడ్ ఫోటోకి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడని జయకుమార్ మీద కేసు పెట్టాడు వర్మ. దీనిపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.
జూన్ 1న రిలీజ్ అవబోతున్న ఆఫీసర్ సినిమా అసలైతే మే 25న రిలీజ్ కావాల్సింది. కాని జయకుమార్ కోర్ట్ లో ఫిర్యాదు చేయడం వల్లే అది వాయిదా పడింది. సంధి కుదుర్చుకునే మార్గం లేకపోవడంతో ఇలా ఆర్జివి కూడా జయకుమార్ మీద రివర్స్ కేసు పెట్టడం జరిగింది.