స్టార్ బర్త్ డే వస్తే ట్విట్టర్ పిట్ట హోరెత్తాల్సిందే. ఆరోజు టాప్ ట్రెండింగ్ లో ఉండాల్సిందే సరిగ్గా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు స్టార్ ఫ్యాన్స్. ఈరోజు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా ఏకంగా 2.2 మిలియన్ బర్త్ డే ట్వీట్స్ వచ్చాయంటే ఎన్.టి.ఆర్ బర్త్ డే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో జరుపుకున్నారో అర్ధమవుతుంది. ఫ్యాన్స్ చేసే ఈ హంగామా ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
ఇక ఇదవరకు ఒక ఎకౌంట్ నుండి అది ఫేస్ బుక్, ట్విట్టర్ ఎలాంటిదైనా ఎక్కువ ట్వీట్స్ వస్తుంటే ఆ ట్విట్టర్ హ్యాండిల్ ను క్లోజ్ చేసేది. ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ స్టిక్ట్ రూల్స్ లో కూడా 20 లక్షల పైగా ట్వీట్స్ తో ఎన్.టి.ఆర్ కు బర్త్ డే విషెశ్ అందాయంటే తారక్ ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఐపిఎల్ సీజన్ హంగామా కూడా నడుస్తూనే ఉంది అయినా సరే ఎన్టీఆర్ బర్త్ డే ముందు అవేవి నిలబడలేదు.
ఇక టాప్ 5 బర్త్ డే ట్రెండింగ్స్ రికార్డులు చూస్తే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2.9 మిలియన్ ట్వీట్స్ కాగా.. ఎన్.టి.ఆర్ బర్త్ డే ట్వీట్స్ 2.2 మిలియన్స్. ఇక థర్డ్ ప్లేస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ బర్త్ డేకు 2.1 మిలియన్ ట్వీట్స్ ట్రెండ్ అయ్యాయి. ఇక ఆ తర్వాత ప్లేస్ లో మహేష్ 1.1 మిలియన్, అల్లు అర్జున్ 925.6#క్# ట్వీట్స్ వచ్చాయి.
2018 లో మాత్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మొదట ఈ రికార్డ్ అందుకోవడం జరిగింది. సినిమా విజయాలతోనే కాదు ట్విట్టర్ లో కూడా యంగ్ టైగర్ సత్తా ఏంటో ఈ విధంగా తెలుస్తుంది.