Gossipsఅంతా బాలయ్యదే.. పేరుకే కొర్రపాటి..!

అంతా బాలయ్యదే.. పేరుకే కొర్రపాటి..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన ప్రయత్నం మొదట్లో కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు అవన్ని సర్ధుకుని మళ్లీ సెట్స్ మీదకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. తేజ డైరక్షన్ లో తెరకెక్కాల్సిన ఆ సినిమా కాస్త తేజ క్విట్ అవడంతో కొద్దిరోజులు పలువురు దర్శకులతో డిస్కస్ చేసి ఫైనల్ గా క్రిష్ చేతుల్లో ఈ ప్రాజెక్ట్ పెట్టేశాడు బాలకృష్ణ.

ఇక ఈ సినిమాకు నిర్మాతగా సాయి కొర్రపాటి చేస్తున్నా వెనుక మొత్తం బాలయ్యే ఫండింగ్ ఇస్తున్నాడని తెలుస్తుంది. బాలకృష్ణ తన ఎన్.బి.కే ఫిలింస్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. పేరుకి మాత్రం సాయి కొర్రపాటిని వాడుతున్నారట. రోజు వారు ఖర్చులు ప్రొడక్షన్ విషయాలను చూసుకునేందుకు సాయి కొర్రపాటి సపోర్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా డైరక్షన్ చేస్తున్నందుకు కూడా క్రిష్ కు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదట. బిజినెస్ లో షేర్ ఇచ్చేలా ప్లాన్ చేశారట. అందుకు క్రిష్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సొంత సినిమా కాబట్టి కేవలం ప్రొడక్షన్ ఖర్చు భరిస్తే సినిమా అవుట్ పుట్ ను బట్టి లాభాలు ఉంటాయి. ఇటీవల వచ్చిన మహానటి సినిమా సూపర్ హిట్ అయ్యే సరికి ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news