మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా నేల టికెట్టు. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మొదటి షో నుండి నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో అయితే దారుణమైన కలక్షన్స్ రాబట్టింది. కనీసం అంటే కనీసం కూడా ఈ సినిమా వసూళ్లు లేవంటే ఎంత దారుణమో చెప్పొచ్చు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు తీసిన దర్శకుడే ఈ సినిమా తీశాడంటే నమ్మలేం.
ఇక ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అక్కడ ప్రీమియర్స్ తోనే బీభత్సమైన రికార్డులు సృష్టిస్తున్నారు. కాని 80 లొకేషన్స్ లో వచ్చిన నేల టిక్కెట్టు మాత్రం ప్రీమియర్స్ తో కేవలం 32,280 డాలర్లను మాత్రమే రాబట్టగలిగింది. ఈ కలక్షన్స్ చాలు రవితేజ రేంజ్ ఎక్కడికి దిగజారిందో చెప్పడానికి.
ఏ కోణంలో కూడా ఆడియెన్స్ ను అలరించే అంశాలు లేని నేల టిక్కెట్టు దర్శకుడి మొదటి వైఫల్యంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ అపజయానికి ప్రధాన కారకుడని చెప్పొచ్చు. మ్యూజిక్ కూడా ఏమంత బాగాలేదు. కళ్యాణ్ కృష్ణ మీద రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాడని చెప్పాలి.