Movies" నా పేరు సూర్య " రివ్యూ & రేటింగ్

” నా పేరు సూర్య ” రివ్యూ & రేటింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్ని నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించగా విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సూర్య (అల్లు అర్జున్) తనకు నచ్చని ఏ విషయం గురించి అయినా ఆలోచించకుండా వారిని కొట్టేస్తుంటాడు. ఆర్మీ ఆఫీసర్ అయిన సూర్య తను చేసే పనుల్ వల్ల తన సుపీరియర్ నుండి సస్పెన్షన్ అందుకుంటాడు. ఈలోగా వైజాగ్ చేరుకున్న సూర్య వర్ష (అను ఎమ్మాన్యుయెల్)ను చూసి ఇష్టపడతాడు. చల్లా (శరత్ కుమార్) చేసే పనులను తెలుసుకున్న సూర్య వారిని అంతం చేయాలని చూస్తాడు. సూర్య తండ్రి ఓ సైకాలజిస్ట్ సూర్యని మార్చేదుకు ఆయన కూడా ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ చల్లా ఏం చేశాడు..? అతన్ని సూర్య ఎలా మట్టుపెట్టాడు..? దేశ సైనికుడిగా సూర్య ఎలాంటి రిస్క్ చేశాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

అల్లు అర్జున్ మరోసారి తన స్టైలిష్ మార్క్ చూపించే సినిమాతో వచ్చాడని చెప్పొచ్చు. యాంగ్రీ సోల్జర్ గా సూర్య పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. దాని కోసం బన్ని పడిన కష్టం అంతా కనిపిస్తుంది. ఫైట్స్, డ్యాన్స్, లుక్ అయితే మాట్లాడేందుకు ఏం లేకుండా అదరగొట్టారని చెప్పొచ్చు. అను ఎమ్మాన్యుయెల్ చిన్న రోలే అయినా పర్వాలేదు బాగానే చేసింది. గాడ్ ఫాదర్ రావు రమేష్, అర్జున్, సాయికుమార్ లు తమ సహజ నటనతో ఆట్టుకున్నారు.

సాంకేరికవర్గం పనితీరు :

విశాల్ శేఖర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. డ్యాన్స్ కూడా బన్ని ఇరగదీశాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ బాగుంది. కథ, కథనాలు గ్రిప్పింగ్ తో నడిపించడంలో డైరక్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. రచయితా మంచి హిట్లు కొట్టిన వంశీ డైరక్టర్ గా కూడా మంచి కథతో వచ్చాడని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న సూర్య ఇండియాకు ఎలాంటి నష్టం కలిగించకుండా చూస్తుంటాడు. ఈ క్రమంలో దేశానికి తమ సొంత స్వార్ధాల కోసం అన్యాయం చేయాలనుకున్న వారిని సూర్య ఏం చేశాడో అదే కథ. కథలో ముఖ్యంగా హీరో క్యారక్టరైజేషన్ దర్శకుడు రాసుకున్న విధానం బాగుంటుంది.

మాస్ లుక్ లో కనిపించిన బన్ని తన ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా వచ్చాడు. మొదటి భాగం అంతా సినిమాలో హీరో పాత్ర తీరుతెన్నుల గురించి చూపించి సెకండ్ హాఫ్ లో అంతా కథ సీరియస్ గా నడిపించాడు. అక్కడక్కడ ట్రాక్ తప్పినట్టు అనిపించినా ఫైనల్ గా సూర్య ఇంపాక్టబుల్ గా ఉంది.

వంశీ డైరక్టర్ గా మొదటి సినిమా చేయడం రిస్కే. అది కూడా తనని నమ్మి బన్ని ఒప్పుకోవడం మరో మంచి విషయం. ఫైనల్ గా బన్ని తన సక్సెస్ మేనియాను కంటిన్యూ చేస్తున్నాడని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

అల్లు అర్జున్

మ్యూజిక్

కథనం

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

అక్కడక్కడ కాత స్లో అనిపిస్తుంది.

బాటం లైన్ :

నా పేర్య సూర్య.. కంప్లీట్ అల్లు అర్జున్ షో..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news