స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. ఈరోజు ఉదయం రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా టాక్ తో పాటుగా మహేష్ భరత్ అనే నేను, హాలీవుడ్ ఎవెంజర్స్ సినిమా రెండు మంచి హిట్ కొట్టడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది.
ఆల్రెడీ స్టార్ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఆడుతుంటే అది తీసే పరిస్థితి ఉండదు కాబట్టి భరత్ అనే నేను, రంగస్థలం సినిమాలకు కేటాయించిన థియేటర్స్ కాకుండా మిగిలినవి అల్లు అర్జున్ నా పేరు సూర్యకు ఇచ్చారు. అప్పటికి రంగస్థలం థియేటర్స్ కొన్ని సూర్యకు కేటాయించినట్టు తెలుస్తుంది.
ఇక సినిమా టాక్ బాగున్నా థియేటర్లు తక్కువవడం వల్ల కలక్షన్స్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఇక ఎలాగు ఏపి, తెలంగాణాలో రోజుకి 5 షోస్ కు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. అయితే మరి అంత ఉదయాన్నే షో అయినా రిలీజ్ నాడు ఓకే కాని ఆ తర్వాత రోజులు మాత్రం కష్టమే.
దాదాపు 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన నా పేరు సూర్య సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 80 కోట్లు రావాల్సిందే. మరి ఈ సినిమా అంత రాబడుతుందో లేదో చూడాలి.