బాక్సాఫీస్ పై దండయాత్ర.. 12 రోజుల కలెక్షన్స్..!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా మే 9న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వనిదత్ సమర్పించగా స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. రిలీజ్ అయిన మొదటి రోజులు నుండి ఇప్పటివరకు వసూళ్ల పరంగా స్టార్ సినిమాలకు ధీటుగా మహానటి కలక్షన్స్ ఉన్నాయి.

తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహానటికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యూఎస్ లో 2 మిలియన్స్ క్రాస్ చేసి అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మహానటి సినిమా ఇప్పటివరకు 12 రోజుల కలక్షన్స్ లెక్క చూస్తే 30.35 కోట్లు అని తేలింది.

కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటించాడు. సమంత, విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

ఏరియాల వారిగా మహానటి 12 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం – 7. 85 కోట్లు
సీడెడ్ – 1. 9 కోట్లు
ఈస్ట్ – 1. 4 కోట్లు
వెస్ట్ – 0. 93 కోట్లు
ఉత్తరాంధ్ర – 2. 15 కోట్లు
నెల్లూరు – 0. 44 కోట్లు
కృష్ణా – 1. 6 కోట్లు
గుంటూరు – 1. 35 కోట్లు
ఓవర్ సీస్ – 9. 25 కోట్లు
కర్ణాటక – 15 కోట్లు
తమిళనాడు – 0 . 85 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 12 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా – 30. 35 కోట్లు.

Leave a comment