లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. యూఎస్ లో క్లూడా 150 సెంటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 3 లక్షల డాలర్స్ వసూళు చేసి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు డీసెంట్ కలక్షన్స్ రాబట్టింది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు సూపర్ అనే మాట తప్ప మరో మాట మాట్లాడటం లేదు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసిందని అంటున్నారు. ఇక దుల్కర్ కూడా జెమిని గణేషన్ పాత్రకు న్యాయం చేశాడు. ఓవరాల్ గా యూఎస్, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మహానటి మొదటిరోజు 4.5 కోట్ల వసూళ్లను రాబట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే అఫిషియల్ కలక్షన్స్ మాత్రం ఇంకా నిర్మాతలు ఎనౌన్స్ చేయలేదు. సినిమాకు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. బి, సి సెంటర్స్ లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.