ఏ ముహుర్తాన మహానటి సినిమా మొదలు పెట్టారో కాని ఆ సినిమా ఊహించిన దానికన్నా ఎక్కువ రేంజ్ కు వెళ్లిందని చెప్పొచ్చు. సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ తల పెట్టిన ఈ మహానటి సినిమా ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. బయోపిక్ అంటే ఏదో ఒక డాక్యుమెంటరీ లాగా అని కాకుండా సినిమా అశేష ప్రేక్షక జనం మెప్పుపొందేలా చేశారు దర్శక నిర్మాతలు.
రిలీజ్ నాటి నుండి మంచి మౌత్ టాక్ తో ఎవరు కూడా కనీసం యావరేజ్ అన్నమాట కాకుండా సూపర్ హిట్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇది బయోపిక్ కాబట్టి ఏ సెంటర్స్ మాత్రమే ఆడుతుంది అనుకున్న వారికి షాక్ ఇస్తూ.. బి, సి సెంటర్స్ లో కూడా దుమ్ముదులిపేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ సెంటర్స్ లోనే ఎక్కువ కలక్షన్స్ రాబడుతుందంటే నమ్మాల్సిందే.
లాస్ట్ వీక్ రిలీజ్ అయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో మహానటికి ప్లస్ అయ్యింది. కొన్నిచోట్ల నా పేరు సూర్య ఎత్తేసి మరి మహానటి సినిమా చేస్తున్నారట. ఇప్పటికే 25 శాతం థియేటర్స్ పెరిగాయని తెలుస్తుంది. మొత్తానికి మహానటి మాస్ సెంటర్స్ లో కూడా ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.