పూరి డైరక్షన్ లో తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన సినిమా మెహబూబా. ఫ్లాపుల్లో ఉన్నా రిస్క్ తీసుకోవాల్సిన టైం కాకున్నా సరే తనయుడిని ఎలాగైనా స్టార్ గా నిలబెట్టాలన్న తపనతో పూరి జగన్నాథ్ మెహబూబా సినిమా తీశాడు. 18 కోట్ల బడ్జెట్, పబ్లిసిటీ ఖర్చు 2 కోట్లు కలుపుకుని టోటల్ గా 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా మెహబూబా.
మే 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. అంచనాలను ఏమాత్రం అందుకోలేని మెహబూబా పూర్ ఖాతాలో మరో ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాకు కలక్షన్స్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపుకునే 8 కోట్లు వచ్చాయట. సినిమా బడ్జెట్ లో పూరి రెండు వంతులు, ఛార్మి ఒక వంతు ఉన్నారట.
ఇక లాస్ 12 కోట్లలో కూడా పూరి 8, ఛార్మి 4 కోట్లు భరించాల్సి వస్తుంది. మెహబూబా కోసం ఇళ్లు అమ్మి మరి రిస్క్ తీసుకున్నాడు పూరి. ఇప్పుడు ఈ మిగిలిన లాస్ ను కవర్ చేసుకునేందుకు ఇంకా ఏం చేస్తాడో చూడాలి. దిల్ రాజు రిలీజ్ చేసినా లాసు వస్తే మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు ఒప్పందం కుదుర్చుకున్నారట. అందుకే ఈ నష్టం భరం అంతా పూరి, ఛార్మిల మీద పడుతుంది. ఇన్నాళ్లు ఫ్లాపులొచ్చినా అవి తన నిర్మాణంలోవి కాదు కాబట్టి లైట్ తీసుకున్న పూరి ఉన్న డబ్బులన్ని పెట్టి చేసిన మెహబూబా పెద్ద షాకే ఇచ్చిందని చెప్పొచ్చు.