స్టార్ హీరోలకు లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు వారంతా ఇప్పుడు వార్ని డైరెక్ట్ గా ట్విట్టర్ లో ఫాలో అవుతుంటారు. అయితే స్టార్ హీరోల ట్విట్టర్ ఫాలోవర్స్ లో కనబడే ఫిగర్స్ ఏవి నిజం కాదని చెబుతున్నారు. ఓ స్టార్ హీరో అభిమాని అతని పేరు మీద ఎన్ని ట్విట్టర్ ఎకౌంట్లైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అవన్ని తన అభిమాన నటుడిని ఫాలో అయ్యేలా చేయొచ్చు.
ఇక ఇప్పుడు ఫేక్ ట్విట్టర్ ఎకౌంట్ల మీద గురి పెట్టిన ట్విట్టర్ స్టార్స్ లో ఫాలో అయ్యే వారి ఎకౌంట్లు సగానికి పైగా ఫేక్ అని తేలింది. సౌత్ లో ధనుష్, రజిని ఎక్కువ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తెలుగులో మహేష్ 6.47 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా జరిపిన సర్వే ప్రకారం మహేష్ ఖాతాలో ఫాలో అయ్యే వారిలో 49 శాతం మంది ఫేక్ అని తేలింది.
ఇక మహేష్ తర్వాత సమంత ఫాలోవర్స్ లో కూడా ఈ ఫేక్ రాయుళ్లు ఉన్నారట. అధికంగా తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోవర్స్ లో ఫేక్ ఎకౌంట్స్ ఎక్కువగా ఉన్నాయట. ట్విట్టర్ లో 2.43 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అల్లు అర్జున్ సగం కంటే ఎక్కువగానే తనని ఫాలో అయ్యేది ఫేక్ అని తేలింది. ఈ క్రమంలోనే ఎన్.టి.ఆర్, నాగార్జున, రాజమౌళి. రానాలకు ఈ ఫేక్ ఎకౌట్ల సెగ తగిలింది.
కొందరు హీరోలు ఈ ట్విట్టర్ ఫాలోవర్స్ గురించి రికార్డులు చెప్పుకుంటున్నారు. ఇది అసలు సిసలు లెక్క కాదని ట్విట్టర్ వెళ్లడించింది. మొత్తానికి ట్విట్టర్ పిట్ట ఇచ్చిన షాక్ కు ఈ విషయం తెలుసుకున్న స్టార్స్ అంతా షాక్ అవుతున్నారట.