Gossipsతీవ్ర దుఃఖంలో అంజలి... నిండా ముంచేసాడుగా..!

తీవ్ర దుఃఖంలో అంజలి… నిండా ముంచేసాడుగా..!

కోలీవుడ్ ప్రేమ జంట జై, అంజలి ఇప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గత రెండు మూడేళ్లుగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఈ ప్రేమ జంట వారి ప్రేమను ఓపెన్ గానే ఒప్పుకున్నారు. అంతేనా ఒకరితో ఒకరు చాలా దగ్గరగా ఉన్న పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

పెళ్లికి ముందే సహజీవనం చేస్తూ కూడా కెమెరా కంటికి చిక్కారు. ఇదంతా ఒకప్పటి మాట కాని ఇప్పుడు సీన్ మారింది. అనజలి అంటే బోర్ కొట్టేసిందో ఏమో కాని జై, అంజలికి మధ్య దూరం పెరిగిందట. ఈమధ్య జైకు సినిమా అవకాశాలు లేవు. స్లిమ్ అయిన అంజలి వరుస అవకాశాలను తెచ్చుకుంటుంది. ఈ విషయంలోనే వారిద్దరికి మాటా మాటా పెరిగి దూరమయ్యే దాకా పరిస్థితి వచ్చిందట.

క్రేజ్ ఎవరికి వచ్చినా ఇద్దరు సుఖపడొచ్చు కదా.. మరి వీరి ప్రేమ వ్యవహారం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేక మళ్లీ కలుస్తారా అని కోలీవుడ్ మీడియా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news