నాచురల్ స్టార్ నాని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికి గట్టి షాక్ తగిలిందని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ స్టార్స్ గా స్టామినా పెంచుకుంటున్న ఈ ఇద్దరు లేటెస్ట్ గా వచ్చిన సినిమాల ఫలితాలతో దిమ్మతిరిగేలా షాక్ తగిలింది. ఎవడే సుబ్రమణ్యం సినిమా నుండి ఎం.సి.ఏ వరకు నాని సినిమా అంటే హిట్ అన్నట్టే. ఒకటి రెండు సినిమాలు నానికి ఉన్న ఫాలోయింగ్ ద్వారా ఆడాయన్న టాక్ వచ్చింది. మజ్ఞు, ఎం.సి.ఏ సినిమాల కథల కన్నా నాని క్రేజే సినిమాలను ఆడించాయని అన్నారు. అయితే లేటెస్ట్ గా కృష్ణార్జున యుద్ధం సినిమా నానికి పెద్ద షాక్ ఇచ్చింది. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నానికి ఫ్లాప్ ఇచ్చింది.
ఇక మరో పక్క స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ కూడా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. బన్ని సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి ఈ సినిమాలు మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఫైనల్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి. లేటెస్ట్ గా వచ్చిన నా పేరు సూర్య భారీ అంచనాలతో వచ్చిన ఆ అంచనాలను అందుకోలేదు. యాంగ్రీ సోల్జర్ గా బన్ని కష్టపడినట్టు అనిపించినా ఎక్కడో ఓ చోట ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బేసిందని అంటున్నారు.
రైటర్ గా ఉన్న వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన బన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. మొత్తానికి కెరియర్ సూపర్ స్ట్రాంగ్ గా సాగుతున్న నాని, అల్లు అర్జున్ ల కెరియర్ ఓ ఫ్లాప్ తో డిస్ట్రబ్ అయ్యేలా చేసింది. మరి ఇకనుండైనా సరే కథల విషయంలో ఈ హీరోలు జాగ్రత్త పడతారో లేదో చూడాలి.