భరత్ వచ్చే దాకా చిట్టిబాబుదే హంగామా.. 150 కోట్లు కొట్టేశాడు..!

రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి ఈ సినిమా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. చిట్టిబాబుగా రాం చరణ్ నట విశ్వరూపం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా 11 రోజుల వసూళ్లలో 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూళు చేసింది. దాదాపు 90 కోట్ల పైగా షేర్ వచ్చిందన్నమాట. ఇక రిలీజ్ అయిన నితిన్ ఛల్ మోహన్ రంగ పర్వాలేదన్న టాక్ వచ్చినా రంగస్థలం దాటేసేలా లేదు. ఇక రాబోతున్న నాని కృష్ణార్జున యుద్ధం కూడా రంగస్థలం మేనియాను అడ్డుకునేలా లేదు.

ఇక చెప్పలంటే సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా వస్తేనేన్ కాని మళ్లీ రంగస్థలం కలక్షన్స్ తగ్గుముఖం పడతాయని అంటున్నారు. అంటే ఇంకా ఎలా లేదన్నా మరో 9 రోజుల దాకా రంగస్థలం వసూళ్లకు ఢోఖా లేదు. మరి చూస్తుంటే రంగస్థలం చరణ్ కెరియర్ లో ఇప్పటికే బెస్ట్ గా నిలుస్తుండగా ఇంకా వసూళ్ల దందా కొనసాగిస్తుందని తెలుస్తుంది.

Leave a comment