మెగా వారసుడిగా ఇన్నాళ్లు కమర్షియల్ గా సక్సెస్ లను అందుకుంటున్నా తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకునే సినిమా కోసం ఎదురుచూశాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. రీసెంట్ గా సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం సినిమా రిలీజ్ నాటి నుండి రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాకు ముందు చరణ్ పొజిషన్ ఎలా ఉండేదన్నది తెలిసిందే. కాని రంగస్థలం తర్వాత లెక్కలు మారాయి.
యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ అతి కష్టం అనుకున్న చరణ్ ఏకంగా 2 మిలియన్ క్రాస్ చేసి 3 మిలియన్స్ కు పరుగులు తీస్తున్నాడు. ఇక అక్కడ బన్ని, ఎన్.టి.ఆర్, మహేష్ సినిమాలను బీట్ చేశాడు. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చరణ్ సినిమా బిజినెస్ టాప్ లేచిపోతుంది. ఇన్నాళ్లు వెనుకపడ్డట్టు కనిపించిన చరణ్ కాస్త ఇప్పుడు టాప్ లీగ్ లోకి వచ్చాడు.
రంగస్థలం నిజంగానే చరణ్ పొజిషన్ లో మార్పు వచ్చేలా చేసింది. అంతేకాదు సరైన సినిమా పడితే రాం చరణ్ కూడా తక్కువోడేం కాడని రంగస్థలం నిరూపించింది. ఇక రాబోయే బోయపాటి, రాజమౌళి సినిమాలతో రాం చరణ్ కెరియర్ మరింత స్ట్రాంగ్ అవనుందని చెప్పొచ్చు.