ప్రియా ప్రకాశ్ వారియర్ కేవలం ఒకే ఒక సైగ తో యువత మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న నటి. బాలీవుడ్ ఆగ్ర కథానాయికలకు ధీటుగా సోషల్ మీడియా లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్నుగీటి యువతరాన్ని మత్తెక్కిచ్చిన ఈ అందాల భామ మరో సారి కన్ను కొట్టింది. తాజాగా ఒక చాక్లెట్ కంపెనీ కి చెందిన వాణిజ్య ప్రకటనలో ఈ కేరళ కుట్టి నటించింది. అందులో భాగంగా ప్రియా క్రికెట్ మైదానంలో చాక్లెట్ తింటుండగా ఓ ఆటగాడు విసిరిన బంతి ఆమె వద్దకు వస్తుంది. అప్పుడు ఆ ఆటగాడు బంతిని ఇవ్వమని అడగ్గా ‘విసిరేసిన వస్తువును నేను ముట్టుకోను’ అని చెప్తుంది. ఆ సమాధానం తో మైదానంలో ఉన్న ఆటగాడు కోపం చెందుతాడు అప్పుడు ప్రియా కన్ను కొడుతోంది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన అందరిని ఆకట్టుకుంటుంది.
https://youtu.be/_DhV22MrLu8
మరో సారి కన్ను కొట్టిన ప్రియా ప్రకాష్
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి