రాంచరణ్, సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’ ఇటీవల విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా ఘన విజయం సాధించటంతో విడుదలైన మూడవ రోజు కూడా టికెట్స్ దొరకని పరిస్థితి ఎర్పడింది. కలెక్షన్స్ పరంగా కూడా రంగస్థలం నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేయొచ్చని ఇండస్ట్రీ సమాచారం.
ఈ మధ్య కాలంలో మెగా హీరోలెవరు సరైన హిట్ అందుకోలేక సతమతమవుతున్నారు ఇది వారి అభిమానులని కూడా కొంత నిరాశకు గురి చేసింది. ఈ చిత్రం అటు మెగా అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ లో కొత్త ఉత్సహం తీసుకు వచ్చింది.
ఇది ఇలా ఉండగా ‘రంగస్థలం’ వచ్చిన మూడు వారాలకు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ రాబోతోంది. ఇక ఇప్పుడు రంగస్థలం విజయం మహేష్ సినిమాకి కొత్త సమస్యలు తెచ్చే లాగా ఉంది. ప్రేక్షకులు ‘భారత్ అనే నేను’ సినిమాని రంగస్థలం తో పోల్చి చూసే అవకాశం లేకపోలేదు. ఈ సినిమాలో రాంచరణ్ కథకి జీవం పోసిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు తమ ఇద్దరి అభిమాన కధానాయకుల నటనను పోల్చి చూడొచ్చు.ఇదే గాని జరిగితే ‘భారత్ అనే నేను’ సినిమాకి అనుకోని సమస్యలు తప్పే లాగా లేవు.
మాములుగా ఒక చిత్రం ఘన విజయం సాధించిన తరువాత ఆ వెంటనే విడుదలైయ్యే సినిమాలు ప్రేక్షకులకి అంత త్వరగా నచ్చవు. ఈ కారణం చేత భరత్ అనే నేను సినిమాని అందరికి నచ్చే లాగా దర్శకత్వం వహించాల్సిన బాధ్యత కొరటాల మీదే ఆధారపడి ఉంది. రంగస్థలం మేనియా లో భరత్ అనే నేను హిట్ అందుకుంటుందా లేదా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.