రచయిత, దర్ళకుడు, నిర్మాత కోన వెంకట్ తనను బలవంతం చేసారని శ్రీరెడ్డి ఆరోపించారు. ఓ ఛానెల్ డిస్కషన్ లో ఆమె పాల్గొని అందరి ముందు ఈ ఆరోపణ చేయడం విశేషం. బంజారా హిల్స్ లో శ్మశానం వెనుక వున్న ఓ గెస్ట్ హవుస్ కు పిలిపించి, తనను, తాగుతావా? అని అడిగారని, దానికి తనకు అలవాటు లేదని చెప్పానని శ్రీరెడ్డి వివరించారు. ఆ తరువాత తనను శారీరకంగా బలవంతం చేసాడని ఆమె ఆరోపించారు.
ఇది నిరూపించడానికి తన దగ్గర కొన్ని ఛాట్ షాట్స్ వున్నాయని, పోలీసులు విచారణ చేస్తే, తనకు ఎప్పుడు ఎప్పుడు ఫోన్ లు చేసారు, ఇతర వివరాలు అన్నీ బయటకు వస్తాయని శ్రీరెడ్డి అన్నారు.