పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద యెల్లో మీడియా కుట్ర చేస్తుందంటూ వచ్చిన వాదనకు మెగా హీరోలంతా సపోర్ట్ చేస్తున్నారు. శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ ను అతని తల్లిని తిట్టించి నేనే అని ఒప్పుకున్నాడు వర్మ. అయితే వర్మ వెనుకాల యెల్లో మీడియా ఉంది అని బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ వివాదంపై మెగా హీరోలంతా ఆగ్రహంగా ఉన్నారు. సరైన వేదిక దొరికితే తమ స్పందన తెలియచేసేలా ఉన్నారు.
అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ నా పేరు సూర్య ఆడియో వేడుక మీద ఈ విషయంపై స్పందించాడు. పవన్ గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడటం నాకు నచ్చలేదని. చాలా పర్సనల్ గా వెళ్తున్నారని.. దానికి నేను హర్ట్ అయ్యానని అన్నారు బన్ని. ఇదవరకు చిరంజీవి గారిని అలానే అన్నారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను అలానే అంటున్నారని అన్నాడు.
వెలిగించి చిన్న అగ్గిపుల్లే అయినా దాని పక్క పెట్రోల్ ట్యాకర్ ఉందని.. పవన్ విషయంలో జరుగుతున్న వన్ని తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. మొన్నటిదాకా పవన్ తో పడదు అన్నట్టు ఉన్న బన్ని సడెన్ గా పవన్ కి సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పి మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచాడు.