ప్రస్తుతం తెలుగు సినిమాల నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. అందులోనూ స్టార్ హీరోల సినిమా ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది. బాలీవుడ్ సినిమాలకి ధీటుగా మన సినిమాలు కూడా పోటీ పడే స్థాయికి చేరుకున్నాయి. అయితే ముందు నుండి తెలుగు సినీ పరిశ్రమకి కి చెందిన పెద్దలు సినిమాలకి అయ్యే ఖర్చుని తగ్గించుకుంటే మంచి లాభాలు చోడొచ్చని చెబుతూనే ఉన్న కొంత మంది దర్శక నిర్మాతలు అసలు వినటం లేదు. సినిమా విడుదలైన తరువాత ఏమైనా నెగటివ్ టాక్ వస్తే నష్టపోయేది నిర్మాత కాదు సినిమాని కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్.
ఈ నెల ఏప్రిల్ 20న విడుదల కానున్న `భరత్ అనే నేను` మేకింగ్‌లో గ్రాండ్‌గా ఉంది. ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారు 90 కోట్లు అని ఇండస్ట్రీ సమాచారం. స్టార్ హీరో కదా నిర్మాతలు కూడా ఖర్చు విషయం లో ఎ మాత్రం ముందు వెనుక ఆలోచించటం లేదు. అంత వరకు బాగానే ఉన్నఓ ఇరవై నిమిషాల కోసం ఆరు కోట్లు ఖర్చు పెట్టామని నిర్మాత చెప్పడంతో విన్నవారు ఆశ్చర్యానికి లోనయ్యారు. హీరోకు పాతిక కోట్లు, దర్శకుడికి ఓ పాతిక.. అంటే ఇక్కడే యాభై కోట్లు పోయాయి. అంటే మిగిలిన డబ్బు తో మొత్తం సినిమాని తీశారు అనుకుందాం. అలాగే వచ్చాడయ్యో సామి పాట కోసం కూడా నాలుగు కోట్లు ఖర్చు పెట్టి సెట్ వేశారట. ముందుగా ఈ పాటని ఒక గుడిలో చిత్రీకరించాలి అనుకున్న మూవీ లో ఈ పాటకి ఉన్న ప్రాముఖ్యం వలన బాగా రిచ్ గ కనపడాలి అనే ఉద్దేశంతో నిర్మాత బారి గ ఖర్చు చేసి ఒక సెట్ వేశారని సమాచారం. ఇంకో రెండు రోజుల్లో భరత్ అనే నేను సినిమా ఫలితం తెలిసిపోతుంది.