మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆచారి అమెరికా యాత్ర. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేశాడు. క్రితి చౌదరి, కిట్టు కలిసి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
పూజారి అయిన కృష్ణమాచారి (మంచు విష్ణు) తన గురువుతో కలిసి రాజు (ప్రదీప్ రావత్) ఇంట్లో హోమం చేస్తారు. ఇంట్లో మంచి జరుగుతుందని భావించిన రాజు తన తండ్రి మరణంతో కృష్ణమాచారి అతని గురువు మీద పగ పడతాడు. అతని నుండి తప్పించుకునేందుకు ఆచారి అమెరికా బయలుదేరుతాడు. అమెరికా చేరిన కృష్ణమాచారి, అతని గురువు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరకు చారి ఈ గొడవ నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
మంచు విష్ణు తనదైన శైలిలో నవ్వించేందుకు ప్రయత్నించాడు. అయితే సినిమాలో హీరో పాత్రకి బలమైన క్యారక్టరైజేషన్ లేదని చెప్పాలి. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఓకే అనిపించుకుంది. తనకు దొరికిన స్క్రీన్ స్పేస్ లో టాలెంట్ చూపించింది. ఇక బ్రహ్మానందం సినిమా మొత్తం ఉన్నా రొటీన్ కామెడీనే చేశాడు. ఇక విలన్స్ ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్ కూడా పర్వాలేదు అన్నట్టు చేశారు. ప్రవీం, ప్రభాస్ శ్రీను, పృధ్వి, పోసాని పాత్రలున్నా అంతగా ప్రాముఖ్యత చేకూరలేదు.
సాంకేతికవర్గం పనితీరు :
సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. అమెరికాలో కొన్ని లొకేషన్స్ చాలా అందంగా చూపించారు. తమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి అన్నివిధాలుగా సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు. కథ, కథనాలు ఇవేవి సరిగా కుదరలేదు. ఎడిటింగ్ కూడా జాగ్రత్త పడాల్సి ఉంది.
విశ్లేషణ :
లాజిక్ లేని కథ.. గ్రిప్పింగ్ లేని కథనం.. కలిసి ఆచారి అమెరికా యాత్రని నడిపించాయి. సినిమా అంతా రొటీన్ పంథాలో సాగుతుంది. నాగేశ్వర్ రెడ్డి సినిమాల్లో ఉంటే హ్యూమర్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. కామెడీ చేస్తున్నా అది రొటీన్ గా అనిపిస్తుంది. బ్రహ్మానందం లాంటి పాత్ర త్రూ అవుట్ సినిమా మొత్తం ఉన్నా సినిమా ఎంటర్టైనింగ్ గా అనిపించదు.
మొదటి భాగం ఏదో అలా నడిపించగా సెకండ్ హాఫ్ ఆడియెన్స్ విసుగు తెప్పిస్తుంది. మధ్యలో పాటలు కూడా అంత కుదరలేదు. సినిమా లాజిక్ లేకుండా తీశారు. డైలాగులు కూడా అంత గొప్పగా ఏమి రాయలేదు. కథలో దమ్ము లేకపోవడం వల్ల కథనం కూడా తేలిపోయినట్టు అనిపిస్తుంది.
ఎలాంటి కథనైనా సరే హ్యూమర్ తో హిట్ కొట్టగల సత్తా ఉన్న నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమా ఆడియెన్స్ పేషన్స్ ను టెస్ట్ చేశాడని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా చివరకు ఆడియెన్స్ కు నిరాశె మిగిల్చింది.
ప్లస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొన్ని నవ్వులు
సినిమాటోగ్రఫీ
అమెరికా అందాలు
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం
డైరక్షన్
రొటీన్ స్టోరీ
బాటం లైన్ :
మంచు విష్ణు అమెరికా యాత్ర ఎంటర్టైన్ చేయలేదు..!
రేటింగ్ : 2/5