ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింప చేసిన బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా #RRR. ఊహకి కూడా సాధ్యం కానీ కాంబినేషన్ ని సెట్ చేశాడు జక్కన్న. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ ని నందమూరి ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్ ని కలిపి ఒక సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా కత్తి మీద సాములాంటిదే .రాజమౌళి అటువంటి సాము చేయగలిగిన సమర్థుడు అయినప్పటికీ రెండు ఫ్యామిలీల అభిమానులని నొప్పించకుండా తీయగలగటం అత్యంత సాహాసోపేతం.
రంగస్థలం ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా గురించి బాంబు పేల్చాడు.ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ కాలేదంట. కేవలం రాజమౌళి మీద నమ్మకం … తారక్ తో కాంబినేషన్ నచ్చి ఈ సినిమాకి సైన్ చేసాడంట రాంచరణ్. ఇక ఈ విషయం విన్న మెగా అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారంట. దర్శకుడిగా రాజమౌళి మీద తమకీ నమ్మకం ఉన్నప్పటికీ తారక్ తో కాంబినేషన్ కాబట్టి తన పాత్ర తెలియకుండా ఆ సినిమా ఒప్పుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా చరిత్ర ని తిరగరాసిన బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమా కావడం… అంతకుమించి మెగా నందమూరి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తుండటం తో సగటు తెలుగు సినిమా అభిమాని ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు.