తెలుగు సినిమ స్టామినాను ప్రపంచ సినిమాకు తెలిసేలా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి ఆ సినిమాతో తెచ్చుకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. కేవలం ఓ తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా స్థాయిని కూడా పెంచిన సినిమా బాహుబలి. అందుకే 2000 కోట్లు కలక్షన్స్ సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి చరిత్రలో నిలిచింది.
ఇక ఆ సినిమా వల్ల చాలా దేశాలకు వెళ్లిన రాజమౌళి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కరాచిలో జరుగుతున్న పాకిస్తాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్వీట్ చేయడం జరిగింది. బాహుబలి సినిమా తనకు చాలా దేశాలను ప్రయాణం చేసేలా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తున్నా అంటూ ట్వీట్ చేశాడు జక్కన్న.
ఓ తెలుగు దర్శకుడిగా రాజమౌళికిది కచ్చితంగా గొప్ప విషయమే అని చెప్పొచ్చు. ఇక బాహుబాలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలితో పాటుగా భజరంగి భాయ్ జాన్ సినిమాకు కథ అందించాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఆ సినిమా కొంత భాగం పాకిస్తాన్ లో కూడా షూట్ చేశారు.
Baahubali has given me opportunities to travel to a number of countries… The most exciting of them all is now, Pakistan. Thank you Pakistan international film festival, Karachi for the invite.
— rajamouli ss (@ssrajamouli) March 28, 2018