సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తే.. అబ్బో ఇక అది చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఎగబడతారో తెలిసిందే. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఒకే వేదిక మీద కనిపించడం అరుదైన సంఘట అది కూడా ఫ్యాన్స్ సమక్షంలో అంటే ఇక అదో అద్భుత దృశ్యమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన వేదిక జరుగబోతుంది భరత్ అనే నేను ఆడియో కోసం.
మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్.టి.ఆర్, మహేష్ మధ్య కూడా మంచి రిలేషనే ఉంది. ఎన్.టి.ఆర్ బాద్షాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మహేష్, ఎన్.టి.ఆర్ కలిసి ఒకే వేదిక మీద అంటే అది నిజంగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది చూడాలి. ఏప్రిల్ 20న రిలీజ్ అవనున్న భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.