Gossipsబాలయ్య చర్యలు ఊహాతీతం.. మరో ప్లాప్ డైరెక్టర్ కి అవకాశం !!

బాలయ్య చర్యలు ఊహాతీతం.. మరో ప్లాప్ డైరెక్టర్ కి అవకాశం !!

బాలయ్య 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి విడుదల అయిన దగ్గరనుండి జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక వైపు ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క సినిమాలు గ్యాప్ లేకుండా చేసుకుపోతున్నాడు. ఒక పక్క ఎన్టీఆర్ బయో పిక్ పనుల్లో తలమునకలై ఉన్నా కూడా మరో సినిమాకు అంగీకారం తెలిపి తన చర్యలు ఊహాతీతం అని నిరూపించుకుంటున్నాడు.101 వ సినిమాకు పూరి జగన్నాధ్ పైసా వసూల్ సినిమాకి అవకాశం ఇచ్చినపుడు తగిలిన షాక్ మరిచిపోకముందే.. తమిళ్ డైరెక్టర్ కే ఎస్ రవి కుమార్ కి అవకాశం ఇచ్చి మరింత షాక్ ఇచ్చారు. ఇప్పుడు వీటన్నిటినీ మించిన మరో షాక్ ఇచ్చారు మన బాలయ్య.

ఈ మధ్య వరుస పరాజయాలతో సతమవుతున్న స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ కి తన తర్వాత సినిమాకి అవకాశం ఇచ్చినట్లు ఫిలిం నగర్ సమాచారం.ఈ సినిమా మే 27 న అఫీషియల్ గా ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఇక వినాయక్ దర్శకత్వం లో రానున్న సినిమా కు సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్న టీమ్ మిగతా వివరాలని త్వరలో తెలియచేస్తారని సమాచారం. అక్టోబర్ నుండి బోయపాటి శ్రీను దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా చేయనున్న బాలయ్య స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వెయ్యక మానదు.

సంవత్సరానికి ఒక సినిమా చెయ్యటానికే తల పట్టుకుంటున్న మన కుర్ర హీరోలు బాలయ్య నుండి స్పీడ్ మాత్రమే కాకుండా ప్లాప్ డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం నుండి కూడా ఎంతో నేర్చుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news