Newsపవన్ పై కత్తి మహేష్ మళ్లీ పంచ్.. భలే దెబ్బ కొట్టాడండి..!

పవన్ పై కత్తి మహేష్ మళ్లీ పంచ్.. భలే దెబ్బ కొట్టాడండి..!

ఛాన్స్ దొరికితే పవన్ మీద విమర్శ చేసేందుకు రెడీగా ఉండే కత్తి మహేష్ ఫ్యాన్స్ తో గొడవని ఎలాగోలా సర్ధుమనిగేలా చేసుకున్నా జనసేన కార్యక్రమాల గురించి అడపాదడపా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే కత్తి మహేష్ తో గొడవకు ఫ్యాన్స్ తరపున వకాళ్తా పుచ్చుకుని సంధి కుదిర్చిన దిలీప్ సుంకర ఇప్పుడు పవన్ కు ఆ పార్టీకి దూరమవుతున్నాడని టాక్.

ఇదే విషయాన్ని తీసుకుని మళ్లీ పవన్ పై పంచ్ వేశాడు కత్తి మహేష్. ఓ సామాన్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవాలంటే రెండు వారాలు పట్టొచ్చు. ప్రతిపక్ష నేత జగన్ ను కలవాలంటే పాదయాత్రలో ఎక్కడైనా కలవచ్చు. కాని జనసేన పార్టీ అభిమాని దిలీప్ సుంకర పవన్ ను కలవాలంటే మాత్రం 4 సంవత్సరాల టైం పడుతుంది అది ఇంకా కొనసాగుతుందని ట్వీట్ చేశాడు.

దిలీప్ ను అడ్డుపెట్టుకుని కత్తి మహేష్ మరోసారి పవన్ పై తన విమర్శనాస్త్రం సంధించాడని చెప్పొచ్చు. ఛాన్స్ దొరికితే పవన్ పై అంతెత్తున లేస్తున్న కత్తికి పవన్ ఎలా సమాధానం ఇస్తాడో చూడాలి.

Latest news