సోషల్ మీడియా వేలం వెర్రిలో పడి ఒకప్పుడు సిని తారలు తమ వైపు చూస్తే చాలు అనుకున్న ప్రేక్షకులు వారితో లైవ్ చాటింగ్ చేసే పరిస్థితి వచ్చింది. అయినా సరే తలతోక లేని ప్రశ్నలతో చిత్ర విచిత్రమైన కామెంట్స్ తో వారిని ఇబ్బంది పెడుతుంటారు. అయితే కొన్ని సార్లు స్టార్స్ ను అవమాన పరచేలా.. వ్యక్తిగత విమర్శలకు దిగుతారు కొందరు ఆకతాయిలు. ఇలాంటి వారి కోసమే బాలీవుడ్ లో ఎం.టివి ఓ స్పెషల్ ప్రోగ్రాం పెట్టింది.
ట్రోల్ పోలీస్ పేరుతో ఎక్కువ ట్రోలింగ్స్ అది కూడా వ్యక్తిగత దూషణలకు దిగిన వారిని టార్గెట్ చేస్తారు. ఒక సెలబ్రిటీ తన మీద దూషణలకు దిగిన సదరు వ్యక్తితో డైరెక్ట్ మీటింగ్ అన్నమాట. ఈమధ్య జరీన్ ఖాన్ ఈ ప్రోగ్రాంలో పాల్గొనింది. సల్మాన్ ఖాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తన మార్క్ చూపించేందుకు హాట్ మూవీస్ చేస్తూ వచ్చింది. ఇక ఆమెను చూసి కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని డైరెక్ట్ గా కలిసింది జరీన్ ఖాన్.
ఆ నెటిజెన్ తన పై చేసిన కామెంట్స్ గోడపై చూపించి వాటికి వివరణ కోరింది. అంతేకాదు ఆమె కోపం చూస్తే అతని చెంప చెల్లుమనిపించేలా చేసిందని చెప్పాలి. తన తల్లికి ట్విట్టర్ ఎకౌంట్ లేదు కాని ఈ కామెంట్స్ చూస్తే తను మానసికంగా చచ్చిపోయేదని అన్నది. ఓ డాక్టర్ వృత్తిలో ఉన్న నీవు ఇలాంటి కామెంట్స్ పెట్టావంటే తల్లి తండ్రులను గౌరవించవని అర్ధమైందని అతన్ని గట్టిగానే వాయించేసింది జరీన్ ఖాన్.