Moviesవరుణ్ తేజ్ , రాశి ఖన్నా ల తొలిప్రేమ రివ్యూ,...

వరుణ్ తేజ్ , రాశి ఖన్నా ల తొలిప్రేమ రివ్యూ, రేటింగ్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ ఫిదాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక వెంకీ అట్లూరి డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా తొలిప్రేమ. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 10 (శనివారం) రిలీజ్ అవుతున్న ఈ సినిమా విశేషాలేంటో సమీక్షలో చూద్దాం.

కథ :

లండన్ లో ఉండే ఆదిత్య (వరుణ్ తేజ్) తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు.. ఇంటర్ చదివే రోజుల్లో ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా)ను చూసి ప్రేమలో పడతాడు ఆదిత్య. వర్షను చూడగానే లవ్ ప్రపోజ్ చేస్తాడు. వర్ష కూడా ఆదిత్యాను ఇష్టపడుతుంది. ఇద్దరు మంచి ప్రేమపక్షులుగా ఉన్న సమయంలో పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. ఓ చిన్న ట్విస్ట్ వల్ల ఇద్దరు విడిపోతారు. మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత కలుస్తారు. ఇంతకీ ఆదిత్య, వర్ష ఎందుకు విడిపోయారు..? వారు మళ్లీ కలిశారా..? వారి ప్రేమను నిలబెట్టుకునారా అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

ఫిదా హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న వరుణ్ తేజ్.. తొలిప్రేమలో ఆదిత్య పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. లవ్ ఫీల్ ను బాగా ప్రెజెంట్ చేశాడు. ఇక రాశి ఖన్నా వర్షాగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. ఇక మిగతా పాత్రలన్ని సినిమా కథలో భాగంగా బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

జార్జ్ సి విలియమ్స్ కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమా ఎక్కువ భాగం ఫారిన్ లోనే కాబట్టి రిచ్ లొకేషన్స్ స్క్రీన్ నిండుగా కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ కూడా ఫీల్ గుడ్ తో ఇంప్రెస్ చేస్తుంది. బి.జి.ఎం కూడా అలరించింది. రెండు సాంగ్స్ బాగా నచ్చేస్తాయి. ఇక వెంకీ అట్లూరి కథ పాతదే అయినా కథనంలో కాస్త రీఫ్రెష్ మెంట్ కనిపిస్తుంది. తెర మీద సాధ్యమైనంత వరకు ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ చూపించేందుకు ప్రయత్నించాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఇక బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విశ్లేషణ :

ప్రేమకథలు ఎన్నొచ్చిన వాటిని మళ్లీ మళ్లీ చూస్తారు ప్రేక్షకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీల్లో ఒకటైన తొలిప్రేమ టైటిల్ తో వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా తొలిప్రేమ. సినిమా మొత్తం ఫీల్ గుడ్ మూవీగా తీశాడు వెంకీ. తొలిప్రేమ.. టైటిల్ లోనే కథ తెలుస్తుంది.

ఆ టైటిల్ జస్టిఫికేషన్ బాగా చేశారు. అయితే హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం లాంటి కథలు.. సినిమాలు ఇదవరకు చాలా చూశాం. ఈ సినిమాలో ఇద్దరు విడిపోయిన సందర్భం బలంగా ఉన్నా.. అది ఆడియెన్స్ ను కన్విన్స్ చేసేలా ఉండదు. సినిమా మాత్రం ఫీల్ గుడ్ తో నడిపించడంలో సక్సెస్ అయ్యాడు డైరక్టర్.

ఫిదా తర్వాత వరుణ్ తేజ్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. కథ, కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాలో రాశి ఖన్నా ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది. కథలో బలం లేకున్నా కథనంలో ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమాను బాగానే క్యారీ చేశాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు మధురానుభూతుని పంచడంలో సక్సెస్ అవుతుంది తొలిప్రేమ.

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్, రాశి ఖన్నా

స్క్రీన్ ప్లే

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ కామెడీ

అక్కడక్కడ ల్యాగ్

బాటం లైన్ :

ప్రేమ పరవశంలో మునిగి తేలేలా వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’.

రేటింగ్ : 3.25/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news