Gossipsమెగా ఫైట్ కి బ్రేక్.. బావ కోసం బావమరిది త్యాగం..!

మెగా ఫైట్ కి బ్రేక్.. బావ కోసం బావమరిది త్యాగం..!

మెగా హీరోలిద్దరు ఒకేసారి బాక్సాఫీస్ మీద పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 9న మెగా హీరో వరుణ్ తేజ్ తొలిప్రేమ, మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ రెండూ రిలీజ్ ప్లాన్ చేశారు. ఆగష్టు 11న ఏవిధంగా లై, జయ జాయనకి నాయకా, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఎలా ఒకే రోజు రిలీజ్ అయ్యాయో ఇప్పుడు ఫిబ్రవరి 9న తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి, కిరాక్ పార్టీ సినిమాలు పోటీ పడుతున్నాయి.

అయితే ఈ పోటీలో ముందుగానే మేల్కొన్న నిఖిల్ కిరాక్ పార్టీ టీం సినిమాను వాయిదా వేయగా.. గాయత్రి మాత్రం అనుకున్న డేట్ కు వస్తుందని తెలుస్తుంది. ఇక ఎటొచ్చి మెగా హీరోలు ఇద్దరు ఒకేరోజు బాక్సాఫీస్ ఫైట్ కష్టం కనుక మెగా హీరోకి సర్ధి చెప్పి వరుణ్ తేజ్ తొలిప్రేమను ఒకరోజు ఆలస్యంగా తెస్తున్నారట. తొలిప్రేమ సినిమా వరల్డ్ వైడ్ 17 కోట్లకు కొనేసిన దిల్ రాజు ఈ చిన్న అడ్జెస్ట్ మెంట్ చేశాడని అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన తొలిప్రేమ టైటిల్ తో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుణ్, సాయి ధరం తేజ్ ఇలా ఒక్కరోజు గ్యాప్ తో వస్తున్నా ఎవరికి ఉండే ఫాలోయింగ్ వారికి ఉంది కాబట్టి సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news