మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విక్రం సిరికొండ డైరక్షన్ లో వచ్చిన సినిమా టచ్ చేసి చూడు. ఈ సినిమా మొదటి షో నుండే ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనంతో సినిమా వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. అసలు సినిమా కథ ఎక్కడ దెబ్బేసింది అన్న పాయింట్ ఆలోచిస్తే సినిమా గురించి కొన్ని ప్లస్సులు.. మరి కొన్ని మైనస్సులు గుర్తుక్సొస్తాయి.
కలిసి వచ్చిన అంశాలు :
మాస్ రాజా రవితేజ తనదైన శైలిలో మెప్పించే పాత్రలో కనిపించాడు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ కమర్షియల్ అంశాలు సినిమాలో ఉండేలా జాగ్రత్త పడ్డారు. సినిమాలో గ్లామర్ టచ్ కోసం.. రాశి ఖన్నా, సీరత్ కపూర్ లు మిగతా సినిమాల కన్నా కాస్త గ్లామర్ డోస్ పెంచారని చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్ల గురించి చెప్పుకుంటే :
వక్కంతం వంశీ రాసిన ఈ కథ రొటీన్ గా సాగింది. మొదట సాధారణంగా కనిపించే హీరో.. అతనికి ఓ ఫ్లాష్ బ్యాక్.. ఇలాంటి కథలు మనం చాలా చూశాం. అయితే పాత కమర్షియల్ రొటీన్ ఫార్ములా కథ అవడం పెద్ద మైనస్. ఇక విక్రం సిరి దాన్ని డైరెక్ట్ చేసిన విధానం కూడా పాత పంథాలోనే వెళ్లడం మరో మైనస్. కథ, కథనాలేవి ఆడియెన్స్ కు థ్రిల్ కలిగించవు సరికదా సహనాన్ని పరిక్షిస్తాయి. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అంటున్నారు. జాంబ్ 8 గ్రూప్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.
కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులు సైతం ఎంకరేజ్ చేసేలా వస్తున్న సినిమాల మధ్య ఈ టచ్ చేసి చూడు. అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు.