మలయాళ భామే అయినా తెలుగు తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ అమలా పాల్. డైరక్టర్ విజయ్ తో ప్రేమ పెళ్లి చేసుకుని కొద్దికాలానికే విడాకులు ఇచ్చేసిన అమ్మడు తాజాగా తనపై తమిళ వ్యాపారవేత్త లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే అత్యాచార ఘటనలను ఆపలేకపోతున్నారు.
సిని పరిశ్రమలో స్టార్ గా ఉన్న అమలా పాల్ తో అళగేశన్ వ్యాపారవేత్త అసభ్యంగా మాట్లాడాడని అతనిపై కేసు పెట్టింది అమలా పాల్. అమలాపాల్ కంప్లైంట్ తో అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మాటలు, చేతలతో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని అమలా పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్స్ తమని మోసం చేసిన వారి గురించి హాట్ హాట్ గా మాట్లాడుతుంటే ఏకంగా ఓ బయట వ్యక్తి హీరోయిన్ ను ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది.