భారత ప్రధాని కొత్తగా రైతుల గురించి టాప్ (టొమాటో-ఆనియన్-పొటాటో) అంటూ కొత్త ప్రయోగం చేస్తున్నారు. రైతు సంక్షేమం కోసం ఈ టాప్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని ప్రవేశ పెట్టిన ఈ టాప్ ను విమర్శించి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్, మాజి ఎంపి రమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
రమ్య ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది.కన్నడ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. సిని గ్లామర్ తో ఆమె కాంగ్రెస్ ఎంపిగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఇంచార్జ్ గా పనిచేస్తున్న ఆమె ప్రధాని అన్న టాప్ మాటలకు రెస్పాన్స్ గా అవి మోడి పాట్ (మత్తులో) ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని అన్నారు. పాట్ అంటే మాదకద్రవ్యాల మత్తు అనే అర్ధం వస్తుందని బిజెపి నేతలు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
అయితే రమ్య మాత్రం పాట్ అంటే పొటాటో ఆనియన్ టొమాటో అని ఎందుకు అనుకోకూడదు అంటూ చెప్పుకొస్తుంది. దేశ ప్రధాని మీద కామెంట్ చేసినందుకు రమ్యపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రమ్య చేసిన కామెంట్ దేశ ప్రభానికి అర్ధమవడానికి ముందే రాహుల్ గాంధికి అర్ధమైందని బిజెపి అధికార ప్రతినిధి జివి.ఎల్.నరసింహారావు ట్వీట్ చేశారు.