Newsశ్రీదేవి హఠాణ్మరణం.. శోకసముద్రంలో సినీ పరిశ్రమ..!

శ్రీదేవి హఠాణ్మరణం.. శోకసముద్రంలో సినీ పరిశ్రమ..!

ప్రముఖ సినీ నటి శ్రీదేవి (54) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దుబాయ్ కు పెళ్లి వేడుకకు ఫ్యామిలీతో వెళ్లిన శ్రీదేవి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయారట. అక్కడికక్కడే మృతిచెందారని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు శ్రీదేవి. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మలయాళంలో 26, కన్నడలో 6 సినిమాలు చేశారు శ్రీదేవి.

1963 ఆగష్టు 13న న త్మైళనాడు శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మా యాంగేర్ అయ్యాపాన్. ఆమె తునాయివన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశారు. తెలుగులో మొదటిసారి మా నాన్న నిర్దోషి సినిమాలో నటించిన శ్రీదేవి ఆ తర్వాత 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

15 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటుగా 2013లో ప్రభుత్వం తరపున పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు శ్రీదేవి. 1996లో బోణీకపూర్ ను పెళ్లాడిన శ్రీదేవి 2017లో మామ్ సినిమా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news