Moviesశ్రీకాంత్ రా..రా మూవీ రివ్యూ & రేటింగ్

శ్రీకాంత్ రా..రా మూవీ రివ్యూ & రేటింగ్

శ్రీకాంత్ హీరోగా శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రా..రా. హర్రర్ కామెడీ మిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ సరసన సీతా నారాయణ నటించిన ఈ సినిమాకు ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందించాడు. ఆలి, జీవా, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర లాంటి ఆర్టిస్టులందరు ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

డైరక్టర్ అయిన హీరో ఓ పాడుపడ్డ బంగ్లాలో షూటింగ్ కు వెళ్తాడు. తన కాస్ట్ తో ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోకి అనుకోకుండా ఆ ఇంట్లో ఏదో జరుగుతున్నట్టుగా గమనిస్తాడు. తాను ఊహించినట్టుగా ఇంట్లో ఆత్మలు తిరిగుతున్నాయని.. వాటితోనే తన మూవీ ప్లాన్ చేస్తాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఆత్మలు ఎందుకు ఉన్నాయి. హీరో వాటి నుండి తనని తన టీం ను ఎలా తప్పించాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

హీరోగా శ్రీకాంత్ తన కెరియర్ లో మొదటిసారి ఇలాంటి సస్పెన్స్, హర్రర్ అటెంప్ట్ చేశాడని చెప్పాలి. హీరోగా తన వరకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు శ్రీకాంత్. ఇక సితా నారాయన కూడా బాగానే నటించింది. ఆలి, జీవా, పృధ్వి, పోసాని, రఘు బాబు, వేణు, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, షకలక శంకర్ అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాలో కెమెరా వర్క్ బాగుంది. హర్రర్ సినిమాకు కావాల్సిన సినిమాటోగ్రఫీ వెరైటీగా అనిపించింది. ఇక డైరక్టర్ అనుకున్న పాయింట్ ను తెరకెక్కించిన విధానం బాగానే ఉంది. స్క్రీన్ ప్లే కాస్త డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

డైరక్టర్ శంకర్ కథ, కథనాలన్ని రొటీన్ పంథాలోనే సాగించాడు. సినిమా చూస్తున్న ఆడియెన్స్ కథనం ముందే కనిపెట్టేళా ఉంటుంది. ట్రైలర్ టీజర్ లో సినిమాలో విషయం ఉన్నట్టు అనిపించినా కథనంలో మ్యాజిక్ ఏమాత్రం లేదు. ఇక లీడింగ్ యాక్టర్స్ తో పాటుగా కామెడియన్స్ కు సమానంగా పాత్రలున్నాయి.

సినిమా అంతా ఒకే బంగ్లాలో తీశారు కాబట్టి సినిమాకు పెద్దగా కర్చు అయ్యి ఉండదు. అయితే సినిమా కథ కథనాలను ఇంకాస్త గ్రిప్పింగ్ తో రాసుకుని ఉంటే బాగుండేది. మొదటి భాగం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించగా.. సెకండ్ హాఫ్ మరి ల్యాగ్ చేశాడని అనిపిస్తుంది. శ్రీకాంత్ ఈ టైంలో ఇలాంటి సాహసం చేయడం గొప్ప విషయమే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్, క్లాస్, లవ్ సినిమాలు చేసిన శ్రీకాంత్ మొదటిసారి ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నాడు.

కథ, కథనాల్లో కొత్తదనం లేకున్నా అటెంప్ట్ మాత్రం మెచ్చుకోదగినదే.. రొటీన్ గా అనిపిస్తున్న హర్రర్ కథల్లానే ఇది కూడా ఉంటుంది. సినిమాను ఇంకాస్త జాగ్రత్తగా తీసుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

లీడింగ్ కాస్ట్

అక్కడక్కడ కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే

సెకండ్ హాఫ్ ల్యాగ్

బాటం లైన్ : శ్రీకాంత్ రా..రా భయపెట్టలేని సినిమా..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news