గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఒక అమ్మాయి తెగ ట్రెండ్ అవుతోంది. అదే.. ప్రియా ప్రకాష్ వారియర్! ‘ఓరు అదార్ లవ్’ మూవీలో హీరోయిన్గా ఈమె నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ‘మాణిక్యా’ అనే పాటని రిలీజ్ చేయగా.. అందులో కేవలం 30 సెకన్లపాటు తన క్యూట్ హావభావాలతో అలా కన్నుకొట్టడంతో అందరూ ఫిదా అయిపోయారు. రీజనల్గానే కాదు.. దేశవ్యాప్తంగా ఆమె క్యూట్‌నెస్‌కి పడిపోయారు. దీంతో.. ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె గురించే పోస్టులు. ఇంకా ఈ హవా ఏమాత్రం తగ్గకముందే.. మళ్ళీ గుండెల్ని దోచుకోవడానికి ఈ బ్యూటీ వచ్చేసింది.
లేటెస్ట్గా ఈ మూవీ టీజర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రియా విపరీతంగా పాపులర్ అయ్యింది కాబట్టి.. ఆమె పార్ట్‌కి సంబంధించే 40 సెకన్ల టీజర్ విడుదల చేశారు. ఇందులోనూ ఆమె గత మ్యాజిక్‌ని రిపీట్ చేస్తూ.. మరింత ఆకట్టుకుంది. ఈసారి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, గుండెల్ని పేల్చేసింది. స్కూల్లో టీచర్ పాఠాలు చెబుతుండగానే.. తరగతి గదిలోనే హీరో-హీరోయిన్లు చూపులతో రొమాన్స్ చేసుకోవడం, అదే టైంలో హీరోయిన్ కిస్ ఇవ్వడం.. అబ్బో అదో అపురూపమైన అనుభూతి. సరిగ్గా ఆ మూడ్‌ని క్యాచ్ చేస్తూ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా ఆకట్టుకుంది. చూసిన ప్రతిఒక్కరూ అదో తెలియని లోకంలో మునిగితేలుతారంతే! మీరూ ఓ లుక్కేసుకోండి…