Newsకన్నుకొట్టిన పాపకి ముఖ్యమంత్రి దాసోహం

కన్నుకొట్టిన పాపకి ముఖ్యమంత్రి దాసోహం

సినిమా రంగం ఏం పాపం చేసిందో తెలీదు కానీ.. తనది ఏ తప్పు లేకపోయినా తనకే ఎక్కువ వివాదాలు చుట్టుకుంటుంటాయి. తనదైన కళాత్మక ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకోవాలని చూస్తే.. అందులోనే కొందరు తప్పులు పెట్టి, వాతలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటివారి చేతికి లేటెస్ట్‌గా ‘ఓరు అదార్ లవ్’ అనే చిత్రం కొబ్బరికాయ చిక్కినట్లు చిక్కింది. అయితే.. దాన్ని వాళ్ళు పగలకొట్టకముందే ఏకంగా సీఎం దిగిరావడం విశేషంగా మారింది.

మేటర్ ఏంటంటే.. ఈనెల 9వ తేదీన ‘ఓరు అదార్ లవ్’ మూవీలోని ‘మాణిక్యా మలరాయ పూవి’ అనే పాటని యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రియా ప్రకాష్ వారియర్ తన హావభావాలతో కట్టిపడేయడం, ఆ పాట వైరల్ కావడం అంత వెనువెంటనే జరిగిపోయింది. ఈ పాటని దాదాపు దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేశారు. కానీ.. ఈ పాట వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్‌లో కొందరు యువకులు సినిమా దర్శకుడు ఒమర్ లులూపై, అలాగే నిర్మాతతోపాటు ప్రియాప్రకాష్ మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వర్గంవారు కోరారు. దీంతో.. ఆ చిత్ర దర్శకుడికి, ప్రియాకి బాసటగా ఎంతోమంది నిలిచారు.

ఇప్పుడు కేరళ సీఎం పినరాయి విజయన్ ఆ చిత్రబృందానికి అండగా నిలిచారు. కళలో భావప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ‘‘మపిల్ల పట్టు’’ అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని.. 1978లోనే ఆకాశవాణిలో ఈ పాట ప్రసారమైందని.. ముస్లింల వివాహాల్లో ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నారని ఆయన తెలిపారు. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలని విజయ్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news