సైబర్ నేరాలపై పోలీసువారికి సపోర్ట్ అందిస్తూ.. రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, విజయ్ దేవరకొండ ల వీడియోలు రిలీజ్ చేశారు. సైబర్ క్రైం కు సంబందించిన ఎలాంటి విషయాలైనా సరే పోలీసులకు ధైర్యంగా చెప్పండంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పెట్టొద్దని చెబుతూ ఎన్.టి.ఆర్ మెసేజ్ తో వీడియో రిలీజ్ చేశారు.
వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. తగు జాగ్రత్తలు వహించండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు.. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైంకు రిపోర్ట్ చేయండి. జాగ్రత్త.. అంటూ ఎన్.టి.ఆర్ మెసేజ్ తో కూడిన వీడియో రిలీజ్ చేశారు.
ఈమధ్య సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ను అదునుగా చేసుకుని రకరకాల క్రైం లు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు మోసపోవడం జరుగుతుంది. వాటిని అరికట్టేందుకు క్రైం జరగడానికి ముందే దాన్ని ఆపేలా పోలీసులు ముమ్మర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలను పోలీసులకు కంపైంట్ చేయండని దీని సారాంశం.