Reviewsఇది నా లవ్ స్టోరీ " రివ్యూ & రేటింగ్ "

ఇది నా లవ్ స్టోరీ ” రివ్యూ & రేటింగ్ “

లవర్ బోయ్ తరుణ్ హీరోగా చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది నా లవ్ స్టోరీ. రమేష్ గోపి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రాం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఎస్వి ప్రకాశ్ నిర్మించారు. శ్రీనాధ్ విజయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

అభిరాం (తరుణ్) తన చెల్లి ప్రేమించిన వ్యక్తిని కలుసుకునేందుకు వెళ్తాడు. అక్కడ అభినయ (ఓవియా) పరిచయం అవుతుంది. ముందు శృతిగా పరిచయమై ఆ తర్వాత అభినయగా వాస్తవం చెబుతుంది. ఇద్దరు తమ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ను గుర్తుచేసుకుని ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే అభిరాం ను ప్రేమించిన అభినయ ఫైనల్ గా ఓ ట్విస్ట్ ఇస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి..? అభిరాం, అబినయల ప్రేమ ఫలించిందా అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

తరుణ్ ఉన్నంతలో బాగానే చేశాడు. అయితే కథ కథనాలు అంత గొప్పగా లేకపోవడం వల్ల సినిమాకు తరుణ్ పడిన కష్టమంతా వేస్ట్ అయ్యింది. హీరోయిన్ ఓవియా పర్వాలేదు. తమిళ బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో అంత గొప్పగా క్లిక్ అవదని చెప్పొచ్చు. మంచు మనోజ్ గెస్ట్ రోల్ బాగుంది. ఇక సినిమా అంతా హీరో హీరోయిన్ ల మీదే నడిపించారు.

సాంకేతికవర్గం పనితీరు :

జోసెఫ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు.. కొన్ని చోట్ల కెమెరా వర్క్ బాగుంది. ఇక శ్రీనాథ్ విజయ్ మ్యూజిక్ రెండు పాటలు ఓకే.. అయితే బిజిఎం ఆకట్టుకుంది. సినిమాకు రమేష్ గోపి కథ, కథనాలు రొటీన్ గా సాగాయి. అక్కడక్కడ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

హీరో, హీరోయిన్ తమ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ తెలుసుకుని ఇద్దరు ప్రేమలో పడటం లాంటి కథలు చాలా వచ్చాయి. రొటీన్ గా సాగిన ఈ కథలో కథనం కూడా అంతే రొటీన్ గా తీసుకెళ్లారు. తరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా సినిమాకు తగినంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు. డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి.

హీరో హీరోయిన్ మధ్య లవ్ ఎమోషన్స్ సరిగా పడలేదు. అయితే సినిమా అంతా హీరో, హీరోయిన్ కనిపించడం కూడా బోర్ అనిపిస్తుంది. లీడ్ పెయిర్ కాకుండా సినిమాలో మిగతా పాత్రలే కరువైనట్టు అనిపిస్తుంది. రొటీన్ గా టైం పాస్ చేయిచినట్టు స్క్రీన్ ప్లే నడిచింది. ముందు చెప్పినట్టు అక్కడక్క యూత్ ను ఆకట్టుకునే డైలాగ్స్ తప్ప ఇక సినిమాలో ఏమి లేదు.

ప్లస్ పాయింట్స్ :

తరుణ్

కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

స్క్రీన్ ప్లే

డైరక్షన్

బాటం లైన్ :

ఇది నా లవ్ స్టోరీ.. తరుణ్ వృధా ప్రయత్నం..!

రేటింగ్ : 1.75/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news