సిరియాలోని గౌటా ఉగ్రవాద దాడుల్లో దాదాపు 700 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయినవారిలో 200 మంది చిన్నారులే ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసి మిలిటెంట్ల మీద దాడి చేయాల్సిన ప్రభుత్వం జనావాసాల మీదే తుపాకి గుండ్లు, బాంబ్ పేళుల్లను చేస్తున్నారు.
డమక్కస్ శివారు నగరమైన గౌటాలో ప్రభుత్వం ఆధినంలోనే ఉండే మిలిటెంట్లు మిగతా ప్రాంతాల వారి సహకారంతో తమ బలాన్ని పెంచుకున్నారు. మానవ హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా సిరియా-రష్యా సాగిస్తున్న ఈ బాంబ్ దాడులపై ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అబం సుభం తెలియని పసి ప్రాణాలు వందల కొద్ది గాల్లో కలిసిపోతున్నాయి.
ఈ రణరంగం ఎందుకు.. ఏమిటీ అని తెలియని వందల కొద్ది ప్రాణాలు తమకు తెలిసి తెలిసి ప్రాణాలను కోల్పోతున్నారు. హృదయ విచారంగా కనిపిస్తున్న ఈ దృష్యాలు గుండెలను కదిస్తున్నాయి. ఊరు కాదది వళ్లకాడులా మారిన గౌటా కాల్పుల విరణకు రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.
రోజుకి ఐదు గంటలు మాత్రం దాడుల్ని ఆపుతాం.. ఆలోపే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్. రష్యా చేపట్టిన ఉద్రవాద విముక్తి పోరాటంలో నరబలిగా కనిపిస్తున్న ఈ దృష్యాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి.. ప్రతి మనిషిని మనసుని కదిలిస్తున్నాయి.