సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. రిపబ్లిక్ డే నాడు ఫస్ట్ ఓత్ తో అందరిని పలుకరించిన మహేష్ ఫస్ట్ లుక్ తో కూడా ఇంప్రెస్ చేశాడు. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ మహేష్ కాంబినేసన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కథ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటుందని అంటున్నారు.
వైఎస్ జగన్ తరహాలోనే భరత్ అనే నేను సినిమాలో మహేష్ పాత్ర ఉంటుందని టాక్. కృష్ణ కాంగ్రెస్ కు సపోర్ట్ గా పనిచేసిన నాటి నుండి వై.ఎస్.ఆర్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. కృష్ణ తమ్ముడు ఆది శేషగిరి రావు వైసిపి లీడర్ గా ఉన్నారు. అయితే ఈ కారణాలన్ని తోడై మహేష్ చేస్తున్న సిఎం పాత్ర జగన్ కు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ ఈ వార్తలను కొట్టి పారేస్తుంది.
మరో పక్క వైసిపి వర్గాలు మాత్రం ఈ న్యూస్ ను ఇంకా వైరల్ చేస్తున్నారు. భరత్ అనే నేను లో మహేష్ సిఎం కాబట్టి కాబోయే సిఎం వై.ఎస్ జగన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి అసలు ఈ భరత్ అనే నేను కథ ఎంటో సినిమా వచ్చాక కాని తెలుస్తుంది.