రాజమౌళి సెంటిమెంట్ కు వాళ్లు బ్రేక్ వేశారు..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా బాహుబలి లాంటి అద్భుత కళాకండం తీశారు. ఈ సినిమాతో రాజమౌళి రేంజ్ ఏ స్థాయికి చేరింది అన్నది అందరికి తెలిసిందే. తన సినిమాల వరకు సక్సెస్ టార్గెట్ పెట్టుకునే జక్కన్న తన సినిమాలతో హిట్ అందుకునే హీరో హీరోయిన్స్ విషయంలో మాత్రం ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఏర్పరచుకున్నాడు.

దీనికి అతనితో సంబంధం లేకున్నా సరే అలా జరుగుతుంది. సై సినిమాతో నితిన్, సింహాద్రి సినిమాతో ఎన్.టి.ఆర్, మర్యాద రామన్న సినిమాతో సునీల్ కు హిట్లు ఇచ్చిన రాజమౌళి ఆ హీరోలు ఆ తర్వాత హిట్లు కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే బాహుబలి లాంటి సినిమా చేశాక రానా, అనుష్క ఇద్దరు తర్వాత సినిమాలు కూడా హిట్లు కొట్టారు.

ఈ లెక్కన రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ వేశారు రానా, అనుష్క. ఇక సాహోతో ప్రభాస్ కూడా హిట్ కొడితే ఈ సెంటిమెంట్ కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడినట్టే. మొత్తానికి సాహో ప్రభాస్ హిట్ రాజమౌళి సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు.

Leave a comment